AP : పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం: టీడీపీ

పిఠాపురంలో (Pithapuram) పవన్ కళ్యాణ్‌ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీనే అంటూ వైసీపీ చేసిన విమర్శలకు టీడీపీ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చింది. ‘పవన్‌ను పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది.. అది పూడ్చుకో ముందు. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్’ అని మండిపడింది.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటకు పైగా వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల పేర్లు, స్థానాల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న టీడీపీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై నేతలకు సూచనలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. కాగా రెండు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com