Pawan Kalyan : నా దేశం, నా నేల కోసం పనిచేస్తా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : నా దేశం, నా నేల కోసం పనిచేస్తా: పవన్ కళ్యాణ్
X

సీఎం, డిప్యూటీ సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చెప్పారు. ‘కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నా. పదవుల కోసం కాదు. నా దేశం, నా నేల కోసం పనిచేస్తా. నా వైపు అవినీతి ఉండదు. ఓటు వేయని వారూ నన్ను ప్రశ్నించొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా. హంగులు, ఆర్భాటాలకు వెళ్లను. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు అనుకునేలా పాలన ఉంటుంది’ అని జనసేనాని స్పష్టం చేశారు.

తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవని.. వాటిని అర్థం చేసుకోడానికి సమయం పట్టిందన్నారు. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు.

మరోవైపు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్‌కు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మానవాళిపై కరోనా విరుచుకుపడినప్పుడు డాక్టర్లు అందించిన సేవలు విస్మరించలేం. కరోనాతో దేశంలో 1600 మంది వైద్యులు చనిపోయారు. దురదృష్టవశాత్తూ ఇటీవల వైద్యులు, ఆస్పత్రులపైనా దాడులు జరుగుతున్నాయి. వైద్యులకు రక్షణ కల్పించే అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్తా’ అని పవన్ హామీ ఇచ్చారు.

Tags

Next Story