Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు

జూలై 1న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆరోజు సాయంత్రం వారాహి సభ నిర్వహించి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. 3 రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటు ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజాదికాలు నిర్వహిస్తారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిఫలింపచేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సభా వ్యవహారాలపై పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షించారు. ‘సభ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. శాఖాపరమైన అంశాలు, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలి. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం మోపుదాం. ప్రజలు, అధికారులతో వాడే భాష మర్యాదపూర్వకంగా, సరళంగా, గౌరవంగా ఉండాలి. పరుష పదజాలం వద్దు’ అని సూచించారు.
అటు AP: భారత క్రికెటర్ హనుమ విహారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈరోజు భేటీ అయ్యారు. ఆంధ్రా క్రికెట్ సమస్యల గురించి వారు చర్చించినట్లు జనసేన ట్విటర్‌లో తెలిపింది. దాన్ని రీట్వీట్ చేసిన విహారి, తనకోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలంటూ సమాధానమిచ్చారు. ఆంధ్రా తరఫున క్రికెట్ కొనసాగించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన మంత్రి లోకేశ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com