AP : బీజేపీ పొత్తు అవసరమా పవన్..? ఆంధ్రాలో సెటైర్లు

AP : బీజేపీ పొత్తు అవసరమా పవన్..?  ఆంధ్రాలో సెటైర్లు

టీడీపీ(TDP), జనసేనతో(Janasena) కలవాలని బీజేపీని(BJP ) బతిమాలానని.. ఎన్నో చీవాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 21 భీమవరం సభలో చెప్పుకున్నారు. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. బీజేపీ కూడా ఆసక్తి చూపలేదు.

జనసేన నేతల ఓపెన్ కామెంట్స్ కూడా పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని.. గతంలో జనసేన నేత పోతిన మహేష్ నేరుగానే విమర్శలు చేశారు. అసలు బీజేపీతో కలవడం కన్నా సొంతంగా పోటీ చేస్తేనే ఎక్కువ ఓటు షేర్ వస్తుందని జనసైనికులు చెబుతూ ఉంటారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ రెడీగా లేదు.

జనసేనాని ఇన్నేళ్లు పార్టీని పెంచేందుకు అంత ఉద్యమాలు చేసింది ఇందుకేనా అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అంత కష్టపడినప్పుడు సొంతంగా పార్టీ తరఫున పోటీ చేయడమే ఆయన లక్ష్యం అయి ఉంటే బాగుండేదని.. అంతేకానీ బీజేపీని లేపడానికి కాదనేది కొందరు జనసైనికుల అభిప్రాయం. సీట్ల కేటాయింపులో బీజేపీ కోసం పవన్ కల్యాణే త్యాగం చేయాల్సి వస్తోందన్న విమర్శలు జనసేనలో వినిపిస్తున్నాయి. ఇతర కారణాలతో గెలిచే సీట్లను బీజేపీకి ఇచ్చి వైసీపీకి మేలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం రెడీగా లేరు. తెర వెనుక విషయాలను పవన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. పొత్తులో తక్కువ సీట్లు కాకుండా జనసేన గెలిచే సీట్లను పక్కాగా పట్టుబట్టాలనేది జనసైనికుల ప్రధాన డిమాండ్.

Tags

Read MoreRead Less
Next Story