AP : తెనాలిలో ఇరగదీసిన పవన్.. ట్రెండింగ్ స్పీచ్

ఓ రాయి తగిలితే ప్రభుత్వం, పోలీసులు ఏపీలో హడావుడి చేస్తున్నారనీ.. అదే బాపట్లలో పదిహేడేళ్ల బాలుడిని పోలీసులు కాల్చి చంపితే ఎవరూ పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ తెనాలిలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. "బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్ నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? అని ప్రశ్నించారు పవన్. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా గీసుకుపోతే.. ఏపీ ప్రజలకు జరిగిన గాయం ఆంటూ వైసీపీనేతలు ప్రచారం చేస్తున్నారు." అంటూ.. పవన్ తెనాలిలో ప్రసంగించారు.
"బాబాయిని చంపేశారని ఇద్దరు చెల్లెళ్లు గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీస్ అధికారి మాట్లాడడు. సీబీఐ వస్తే కడప కోటలోకి వెళ్లనివ్వరు. ఇంత దారుణాలు జరుగుతుంటే మనకిపట్టదు. ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటంటారు. మనం మాత్రం చేతులు ముడుచుకు కూర్చుంటాం" అని ఆవేశంగా ప్రశ్నించారు పవన్.
"గంజాయి కేంద్రంగా రాష్ట్రం మారిపోయింది. పోలీసు స్టేషన్లు రౌడీలకు అడ్డాగా మారిపోయాయి. ఎన్ని ఘోరమైన ఘటనలు జరిగినా ఒక్కరికీ గాయం కాలేదు. తప్పు జగన్‌ది కాదు. మనదే. ఆయన ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇసుక మొత్తం దోచేశారు. ఎందరో బీసీలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపాధి ఉండేది. వారి పొట్టలు కొట్టి ఒక్కరికే దోచిపెట్టారు. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌రెడ్డి సారా వ్యాపారిగా మారిపోయాడు అయినా మనం ప్రశ్నించలేకపోతున్నాం" అని పవన్ తాజా ఘటనలపై స్పందిస్తూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com