Visakhapatnam: విశాఖ రుషికొండ వద్ద ఉద్రిక్తత.. హైవేపైనే నిలిచిపోయిన చంద్రబాబు కాన్వాయ్..

Visakhapatnam: విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎండాడ జంక్షన్‌లో టెన్షన్ తలెత్తింది. రుషికొండకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పి.. అడ్డుకోవడంతో హైవేపైనే చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు.. అప్పటికే రుషికొండ వద్దకు వెళ్లిన టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రుషికొండపై నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తవ్వకాలను పరిశీలించేందుకు చంద్రబాబు బయల్దేరారు. ఈ పర్యటనలో అడ్డంకులు సృష్టించడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏపీటీడీసీకి రుషికొండ ప్రాంతంలో 61 ఎకరాల స్థలం ఉంది. అయితే.. ఆ స్థలంలో గతేడాది ఐదెకరాల్లో ఉన్న కాటేజీలను అధికారులు కూలగొట్టారు. రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com