Private Travels Bus Accident : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

X
By - Manikanta |1 Jun 2024 1:12 PM IST
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఇది స్థానికంగా అలజడి రేపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వద్ద హైదరాబాదు నుండి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో లింగంగుంట్ల వద్ద ఓవర్ స్పీడ్ తో కారును తప్పించబోయింది.
కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది ట్రావెల్స్ బస్సు. ఇందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు , ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
వీరందరినీ ,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com