AP : చంద్రబాబు ప్రమాణం.. హాజరుకానున్న ప్రముఖులు వీరే!

సీఎంగా చంద్రబాబు ( Chandrababu Naidu ) ప్రమాణస్వీకారానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. వారిలో ప్రధాని మోదీ, చిరంజీవి, రజనీకాంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, జితన్ రామ్, చిరాగ్ పాస్వాన్, గడ్కరీ, జయంత్ చౌదరి, రామ్‌దాస్ అథవాలే, అనుప్రియా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సీఎంలు ఏక్‌నాథ్ శిండే(మహారాష్ట్ర), మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్), మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు ఉన్నారు.
విజయవాడలో రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉ.10 నుంచి సా.4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉ.9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని వెల్లడించారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ, అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com