16 March 2021 3:06 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / టిడిపి అభ్యర్థిని...

టిడిపి అభ్యర్థిని వైసీపీ కిడ్నాప్ చేసింది : పుట్టా సుధాకర్

టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్‌ విమర్శించారు.

టిడిపి అభ్యర్థిని వైసీపీ కిడ్నాప్ చేసింది : పుట్టా సుధాకర్
X

మార్చి 18న జరిగే మైదుకూరు మేయర్ ఎన్నికకు టిడిపి సభ్యులను రానీయకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆపార్టీ నేత, టిటిడి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఆరోపించారు. పోలీసులు, అధికారుల సాయంతో మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

నైతికంగా ప్రజల ఓట్లతో టిడిపి 21 వార్డుల్లో గెలిస్తే.. ఒక అభ్యర్థిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. మేయర్ ఎన్నిక రోజు మైదుకూరులో ఏం జరిగినా అందుకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల తీరును ప్రశ్నించామన్న అక్కసుతో టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్‌ విమర్శించారు.


Next Story