Rain Predicted : తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు

ఏపీలో ( AP ) వచ్చే 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగా కదులుతుండటం, ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని తెలిపింది. ఉత్తరాంధ్ర మొదలు కాకినాడ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.
ఇక తెలంగాణలో ( Telangana ) మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించింది. నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com