రామతీర్థం ఘటనలో అమాయకులను ఇరికిస్తున్నారు : చంద్రబాబు ట్వీట్‌

రామతీర్థం ఘటనలో అమాయకులను ఇరికిస్తున్నారు : చంద్రబాబు ట్వీట్‌
వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ ట్వీట్ చేశారు బాబు.

రామతీర్థం ఘటనలో అసలు దోషులను పట్టుకోవడం మానేసి.. అమాయకుల్ని ఇరికిస్తున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో అన్నారు. అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలంటూ హింసించడం, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలోకి దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి మీరు ద్రోహం చేస్తారా.. అని బాబు ప్రశ్నించారు. నేరాన్ని తెలుగుదేశం మీదకు నెట్టానుకునే కుట్రలను సహించేది లేదు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరించారు.

వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ ట్వీట్ చేశారు బాబు. పోలీసులు.. ప్రభుత్వం చెప్పినదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ, దేవుడి విషయంలో పాపం మూటకట్టుకోవద్దని.. సూచించారు.Tags

Read MoreRead Less
Next Story