Rammohan Naidu : పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను: రామ్మోహన్ నాయుడు

తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) స్పందించారు. ‘విమానయాన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. నా వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను’ అని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను రామ్మోహన్ నాయుడు షేర్ చేశారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు వయసు 36 ఏళ్లు కాగా.. 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు.
అయితే ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు 1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు.. పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్‌గా ఘనత సాధించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com