Kodali Nani : కొడాలి నానికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani ) హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.గతంలో వైసీపీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులతోపాటు మరికొందరిపై సెక్షన్ 447, 506, రెడ్ విత్ 34 ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు ఇప్పటికే నమోదు చేశారు. దీంతో వీరంతా అరెస్టు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com