AP : పొన్నవోలు, సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

AP : పొన్నవోలు, సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా
X

వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో సొంత లా పుస్తకాలను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడుతున్న న్యాయవాదులు…న్యాయ పోరాటంకు సిద్ధం అవుతున్నారు.

అటు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఇక నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది . దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Tags

Next Story