Chandrababu Letter : చంద్రబాబు లేఖపై రేవంత్ సానుకూల స్పందన!

ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రేపు చంద్రబాబు కు ఆయన లేఖ రాయనున్నట్లు సమాచారం. ఈనెల 6న వీరిద్దరూ ప్రజాభవన్‌లో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. విభజన అంశాలు, అపరిష్కృత సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి.
విభజన హామీల పరిష్కరానికి కలిసి చర్చించుకుందామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6న సాయంత్రం భేటీ అవుదామని చెప్పారు. ముఖాముఖి కలిసి మాట్లాడుకుంటే జటిలమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని, తద్వారా తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com