Roja : రోజాకు బెంజ్‌.. ఇంకెన్ని కార్లు ఉన్నాయంటే..?

Roja : రోజాకు బెంజ్‌.. ఇంకెన్ని కార్లు ఉన్నాయంటే..?

ఎన్నికల అఫిడవిట్ లో లీడర్ల ఆస్తుల జాతకాలు కొంతవరకైనా బయటపడుతుంటాయి. ప్రముఖ సినీ నటీ, ఏపీ మంత్రి ఆర్కే రోజా దాదాపు దశాబ్దకాలం పాటు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూీ రాణిస్తోంది. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు జబర్దస్త్‌లో జడ్జిగా పనిచేసిన ఆమె.. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం హుందాగా వైదొలిగారు. ప్రస్తుతం మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

అఫిడవిట్‌లో మంత్రి రోజా తెలిపిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది. ఇందులో చరాస్తులు రూ.5.09 కోట్లు, స్థిరాస్తులు రూ.7.08 కోట్లని తెలిపారు. రూ. కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు రోజా. నగరిలో తన చరిష్మా తగ్గలేదని.. మళ్లీ గెలుస్తానని చెబుతున్నారు రోజా.

Tags

Read MoreRead Less
Next Story