Roja Comments : జగన్‌కు సపోర్ట్ గా రోజా హాట్ కామెంట్స్

ఏపీ సీఎంగా జగన్ కు జనంలో అచంచల విశ్వసనీయత ఉందని.. అది వైసీపీని గెలిపిస్తుందని తెలిపారు ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే క్యాండిడేట్ రోజా. గెలుపు వైఎస్సార్‌సీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదిరి గ్రామంలో పర్యటించారు. ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సాక్షాధారాలకు చూపించారు రోజా. ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం తమదన్నారు. చేసిన అభివృద్ది ఇదీ అని చూపి ఓట్లడుగుతున్నామని తమ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.
కుల మతాలకు, పార్టీలకు అతీతంగా తాము అభివృద్ధి పనులు చేపట్టామన్న రోజా.. ఎక్కడా వివక్షకు తావివ్వలేదన్నారు. చంద్రబాబు ఎన్ని అస్త్రాలు ప్రదర్శించినా అవన్నీ ఎన్నికల బరిలో తేలిపోయాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com