Bribe Case : రూ.3 లక్షలు లంచం.. పారిపోతుండగా అరెస్ట్

సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ( CSS Inspetor Sudhakar ) రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో రూ.15 లక్షలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో రూ.5 లక్షలు ఇచ్చాడు. రెండో విడతలో రూ.3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ పారిపోయాడు. సినిమా స్టైల్‌లో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు.
వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు మొదటి విడతలో రూ.5 లక్షలు చెల్లించాడు. రెండో విడతలో భాగంగా గురువారం రూ.3లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో బాధితుడు రూ.3 లక్షలను ఇచ్చాడు. ఆ డబ్బును అందుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన సుధాకర్ డబ్బుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో సినీ ఫక్కీలో వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com