AP : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

AP : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

ఏపీలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న సీఎంగా చంద్రబాబు ( Chandrababu ) ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగించింది.

కాగా ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవుల తర్వాత కొత విద్యాసంవత్సరం (2024-25)లో విద్యాసంవత్సరానికి గానూ జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. తాజా పరిణామంతో ఒకరోజు తర్వాత అంటే జూన్‌ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో పాఠశాలలకు విద్యాక్యాలెండర్ ప్రకటించాల్సి ఉంది.

Tags

Next Story