YS Sharmila : నాన్న మాట వినవా..? జగన్‌కు ఆవేదనతో షర్మిల లేఖ

ఏపీలో వైఎస్ వారసుల మధ్య ఆస్తిపంపకాలు తీవ్రంగా మారాయి. జగన్ వ్యవహారశైలిని తెలిపే విధంగా షర్మిల రాసిన ఓ లేఖను తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. వైసీపీ అధినేత జగన్ కు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఘాటుగా లేఖ రాశారు. వైసీపీ అధినేత జగన్, తనకు మధ్య ఆస్తి పంపకాల విషయంపై వివాదం కొనసాగుతోన్న వేళ షర్మిల విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే.. నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, చిల్లి గవ్వ ఇవ్వను.. సరస్వతీ సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి.. అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా అంటూ సొంత చెల్లి షర్మిలను బెదిరిస్తూ జగన్ ఈ ఏడాది సెప్టెంబరులో లేఖ రాశారు. దానికి రిప్లై ఇస్తూ.. సెప్టెంబరు 12న జగన్‌కు ఆమె 8 అంశాలతో రాసిన లేఖను టీడీపీ విడుదల చేసింది. ఆస్తుల విషయంలో తన తండ్రి వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో లేఖ ద్వారా ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ.. తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను.. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నట్లు ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకు ఒప్పుకోనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్, సాక్షి.. ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిక్కచ్చిగా చెప్పారు. వీటన్నింటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు.. మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా అని లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com