AP RERA : ఏపీ రెరా చైర్మన్‌గా శివారెడ్డి.. ఉత్తర్వులు జారీ...

AP RERA : ఏపీ రెరా చైర్మన్‌గా శివారెడ్డి.. ఉత్తర్వులు జారీ...
X

ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)కి కొత్త చైర్మన్‌గా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ ఏ.శివారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవుల కోసం పట్టణాభివృద్ధి శాఖ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కి త్వరలోనే మరో ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నారు.

Tags

Next Story