AP : దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు .. ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు

పల్నాడు జిల్లాను ఉద్దేశించి ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ ఆమె కామెంట్స్ బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందనీ, దానిని కొందరు రాజకీయ నేతలు తమ స్వార్థానికి చెడగొడుతున్నారని ఫైరయ్యారు.
లీడర్ల మాటలు విని ఎవరూ తమను తాము రిస్క్ లోకి నెట్టుకోవద్దని హితవు పలికారు మల్లికాగార్గ్. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదన్నారు.
పోలీసులు అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందనీ.. మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉందన్నారు అన్నారు మల్లికా గార్గ్. మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందని.. సహకరించాలని ప్రజలను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com