AP : రాయలసీమలో ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక పర్యవేక్షణ

AP : రాయలసీమలో ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక పర్యవేక్షణ
X

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 4న నిర్వహించే ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ నిమిత్తం భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

134 - ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అన్నవి దినేష్ కుమార్, 135 - శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి భగవత్ కిషోర్ మిశ్రా, 136 - నందికొట్కూర్(SC) అసెంబ్లీ నియోజకవర్గానికి అభిజిత్ ముఖర్జీ, 139 - నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి రాహుల్ సింగ్, 140 - బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి డా. వేద్ ప్రకాష్ మిశ్రా, 141 - డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి అమిత్ కుమార్ లను పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించింది.

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ, కౌంటింగ్ సిబ్బంది శిక్షణ, ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిర్వహణ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తన ప్రకటనలో వివరించారు. ప్రతి కౌంటింగ్ ఫలితాన్ని ఎన్నికల మీడియా సెంటర్ ద్వారా జారీచేస్తామని.. అధికారిక సమాచారాన్నే జనం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Tags

Next Story