Heat Wave : ఇవాళ రేపు జాగ్రత్త.. మధ్యాహ్నం మంటలే!

Heat Wave : ఇవాళ రేపు జాగ్రత్త.. మధ్యాహ్నం మంటలే!

ఎండలు అదిరిపోతాయంటూ వెదర్ డిపార్టుమెంట్ అలర్ట్ ఇచ్చింది. అందరూ జాగ్రత్తగా మధ్యాహ్నం నీడపట్టునే సేదతీరాలని సూచించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

వేడిగాలులు వీచే అవకాశముందని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో పాటు వేడి గాలులు కూడా వీస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా మజ్జిగ, నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలన్న డాక్టర్ల సూచనను కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉండొచ్చని సూచించింది. శుక్రవారం 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story