SC: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

SC: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం... సీజేఐ ముందుకు క్వాష్‌ పిటిషన్..

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్‌ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని చెప్పారు. దీంతో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలంటూ ద్విసభ్య బెంచ్ విజ్ఞప్తి చేసింది. త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది.


17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చట్టం అమ్లలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే స్కిల్ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17A ప్రకారం... గవర్నర్‌ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని... చంద్రబాబు న్యాయపోరాటానికి దిగారు. క్వాష్‌ పిటిషన్‌ను గతేడాది సెప్టెంబరు 22న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చింది. చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్‌ గతేడాది అక్టోబరు 3కు తొలిసారి జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాల పడింది. అక్టోబర్‌ 13న స్కిల్‌ కేసులో వేసిన క్వాష్‌ పిటిషన్‌తో పాటు ఫైబర్‌గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌నూ ఇదే ధర్మాసనం విచారించింది. రెండు కేసుల విచారణను అక్టోబరు 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు 17-Aపై నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story