SC: లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

SC: లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
X
ఉదయం పదిన్నరకు విచారణ చేపట్టనున్న ధర్మాసనం.. సిట్‌ దర్యాప్తా.. సీబీఐకి అప్పగిస్తారా..?

తిరుమల లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది. అటు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో విచారణ ప్రారంభమైంది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడువిచారణ జరగనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణపై అభిప్రాయం చెప్పేందుకు సొలిసిటర్ జనరల్ మరింత సమయం కోరారు. ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణలో కేంద్రం చెప్పే అభిప్రాయాన్ని బట్టి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ అంశాన్ని ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేయాలన్నది ఖరారు చేస్తారు. ఈ లడ్డూపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

గురువారం వాయిదా అందుకే

గురువారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌గాల్సి ఉండేది. అయితే అదే స‌మయంలో సొలిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వేరే కోర్టులో ఉండ‌టంతో శుక్రవారం మొద‌టి కేసుగా ఈ పిటిష‌న్ల‌ను విచారించాల‌ని ఆయ‌న త‌రపు న్యాయ‌వాదులు అభ్య‌ర్థించారు. అందుకు ధ‌ర్మాసనం అంగీక‌రించి విచారణ‌ను ధ‌ర్మాస‌నం నేడు విచారణ చేపట్టనుంది.

ఈ పిటిషన్లపై విచారణ

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అయితే సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయనుంది. గురువారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్‌ నేటి వరకు సమయం కోరారు. తన పిటిషన్‌పై పార్టీ-ఇన్-పర్సన్‌గా బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు .


కోర్టులపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. సనాతన ధరాన్మి దూషించే వారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పాటించేవారిపై నిర్ధాక్షిణ్యంగా ఉంటే, అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం చూపిస్తాయని అన్నారు. అయిన వాళ్లకు ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags

Next Story