TDP Book Release : జగన్ పాలనలో అన్నీ నేరాలు,ఘోరాలే: అచ్చెన్నాయుడు

TDP Book Release : జగన్ పాలనలో అన్నీ నేరాలు,ఘోరాలే: అచ్చెన్నాయుడు
X
TDP Book Release : అశుభ కార్యంతోనే జగన్ పాలన ప్రారంభించారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

TDP Book Release : అశుభ కార్యంతోనే జగన్ పాలన ప్రారంభించారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మూడేళ్ల జగన్ పాలనలో అన్ని నేరాలు, ఘోరాలేనని ఆరోపించారు. జగన్‌ వెయ్యి రోజుల పాలనలో....వెయ్యి తప్పులంటూ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని చంపేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ఏపీకి రావాల్సిన పెట్టుబడిదారులు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయారని చెప్పారు. వైసీపీ పాలనలో 226 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు అచ్చెన్న. విగ్రహాలపై దాడి జరిగితే జగన్ కనీసం స్పందించలేదన్నారు. దేశ చరిత్రలో ఎక్కడైనా రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిందా అని ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసు, సిబ్బందిపై దాడి జరిగిందని గుర్తు చేశారు. తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందన్నారు.

Tags

Next Story