కళావెంకట్రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

కళావెంకట్రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు
కళా వెంకట్రావు అరెస్ట్.. వైసీపీ కక్ష సాధింపు ధోరణికి, జగన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు.

కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. రాత్రి 9 గంటల సమయంలో 65ఏళ్లు పైబడిన నాయకుడిని అరెస్ట్ చేయడం రాక్షస చర్య అన్నారు. కళా వెంకట్రావు ఏ నేరం చేశారని ప్రశ్నించారు.

రామతీర్థంలో రాముడి తల నరికివేస్తే.. చూడటానికి వెళ్లడమే నేరమా అని నిలదీశారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాన్ని ఖండించడం ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు.

కళా వెంకట్రావు అరెస్ట్.. వైసీపీ కక్ష సాధింపు ధోరణికి, జగన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. పోగాలం దాపురించింది కాబట్టే.. జగన్ రెడ్డి సైకో చేష్టలకు, కిరాతక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Tags

Next Story