CBN: మా జెండాలు వేరైనా ఎజెండా ఒకటే

CBN: మా జెండాలు వేరైనా ఎజెండా ఒకటే
ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అన్న చంద్రబాబు... విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని పిలుపు

బీజేపీ, తెలుగుదేశం, జనసేన జెండాలు వేరైనా ఎజెండా మాత్రం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని..తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అసమర్ధ, అవినీతి పాలనతో ఏపీ చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని పునర్నిర్మించడానికే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని పునరుద్ఘాటించారు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస, అహంకార పాలన చూశామని, జగన్‌ పాలనలో సర్వనాశనమైన ఏపీని గాడిలో పెట్టేందుకే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బొప్పూడిలో ప్రజాగళం బహిరంగసభలో మాట్లాడిన ఆయన... ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం, కలిసి పోటీచేయబోతున్న కూటమికి ప్రజల ఆశీర్వాదం కావాలని పిలుపునిచ్చారు.


వికసిత్‌ భారత్‌ ప్రధాని మోదీ కల అన్న చంద్రబాబు వికసిత్‌ ఏపీ తమ కలని చెప్పారు. జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను చీకటిమయం చేశారనిఅభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలంటే ప్రధాని సహకారం కావాలన్నారు. జగన్‌ సొంత చెల్లెళ్లే ఆయనకు ఓటు వేయవద్దని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు...దేశాన్ని ఆర్థికంగా అత్యంత బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని తెలుగుదేశం అధినేత ధ్వజమెత్తారు. తమ హయాంలో కేంద్రాన్ని ఒప్పించి 11 జాతీయ సంస్థలు తెచ్చామన్న చంద్రబాబు...వాటి నిర్మాణానికి కృషి చేశామని చెప్పారు.రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి ప్రపంచం గర్వించేస్థాయిలో నిర్మిద్దామంటే...ఆ ఆశల్ని మూడు ముక్కల ఆటతో జగన్ చిదిమేశారన్నారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేస్తే నిర్లక్ష్యంతో దాన్ని గోదావరిలో కలిపేశారని ధ్వజమెత్తారు. ఇసుక, మైనింగ్ తో పాటు అన్నింటా అక్రమాలు,దోపిడీలమయమేనని చెప్పారు.జగన్ నిజస్వరూపాన్ని గ్రహించిన ఆయన సొంత చెల్లెళ్లే చివరికి ఆయని ఓటు వేయవద్దని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో, రాష్ట్రంలో NDAదే గెలుపన్న చంద్రబాబు...అందరం కలిసి దగా పడ్డ ఏపీని నిలబెడతామని స్పష్టంచేశారు.


పెట్టుబడులు తరిమేశారు. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదు. ప్రజలకు మనశ్శాంతి లేదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్‌ చీకటిమయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశారు. జగన్ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్‌కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే.. ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. మన బిడ్డలు వెలగాలి. అందుకే ఈ పొత్తు. దేశంలో ఎన్డీయే 400+ సీట్లు వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలి’’అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story