AP : బీజేపీ అగ్రనేతలను కలిసిన టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ (TDP), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పొత్తుపై చర్చించడానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్చి 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. టీడీపీ గతంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగంగా ఉంది. అయితే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి టీడీపీ 2018లో నిష్క్రమించింది.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో, రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై సంతృప్తికరమైన అంగీకారానికి వచ్చిన తరువాత పొత్తు అవకాశం గురించి చర్చలు జరిగాయి. సీట్ల కేటాయింపుపై చర్చల ఫలితాలపై తుది నిర్ణయం ఆధారపడి ఉండటంతో, కూటమి ఏర్పాటుకు ఇరు పార్టీలు నిష్కర్షగా ఉన్నాయని నివేదికలు తెలిపాయి.
నెలరోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య జరిగిన రెండో భేటీ పలు అవకాశాలను తేటతెల్లం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల ఏర్పాటులో ఇక జాప్యం ప్రయోజనం ఉండదని, ఇంకా ఏమైనా సందిగ్ధత ఉంటే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను గందరగోళానికి గురిచేస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com