Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు

Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు
X
Chandrababu : పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్‌ సైడ్‌ ఎలక్షన్‌ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు.

Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్‌ సైడ్‌ ఎలక్షన్‌ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. కార్యకర్తల్లో కసి, పాలనపై ప్రజల అసంతృప్తి... మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌కు కారణమన్న చంద్రబాబు.. ఒంగోలు నేతలు సమిష్టి కృషితో... మహానాడును సక్సెస్‌ చేశారని అభినందించారు.

ఈ నమునాను అన్ని జిల్లాలు పాటించాలన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్‌ పడాల్సిందేనని ఎవరికీ మినాయింపులు లేవన్నారు. ఏ స్థాయిలోనూ గ్రూపులను సహించేది లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక ఓట్ల తొలగింపు విషయంలో గ్రామస్థాయిలో... నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తెచ్చిన.. న్యూట్రిపుల్‌ యాప్‌ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story