TDP 40 Years: 'తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా'.. ఎన్‌టీఆర్ పిలుపునకు 40 ఏళ్లు..

TDP 40 Years: తెలుగు దేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థాన వేడుకలకు సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త లోగోను సైతం ఆవిష్కరించారు అధినేత చంద్రబాబు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని టీడీపీ స్పష్టం చేసింది.
అటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గ్రామ గ్రామాన జెండావిష్కరణలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజాభిమానంతో కొనసాగుతున్న పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులేనని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. తొలుత ఇవాళ హైదరాబాద్‌లో టీడీపీ ఆవిర్భవించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు అధినేత చంద్రబాబతోపాటు పార్టీ సీనియర్ నేతలు వెళ్లనున్నారు.
అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుని చంద్రబాబు నేతలతో సభ నిర్వహించనున్నారు. గత సృతులు గుర్తు చేసుకుంటూనే భవిష్యత్ పోరాటాలపై చంద్రబాబు దిశనిర్దేశం చేయనున్నారు. ఇటు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జులు ఘనంగా ఆవిర్భావ దినోత్పవ వేడుకలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com