కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా : అచ్చెన్నాయుడు

కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా : అచ్చెన్నాయుడు
కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి, దోపిడీలతో దుర్మార్గపు పాలన సాగిస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

జగన్ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తిరుపతి ఉపఎన్నికపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. వైసీపీ రెండేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి, దోపిడీలతో దుర్మార్గపు పాలన సాగిస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. 22 మంది ఎంపీలతో రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు. వైసీపీ ఎంపీలు తమ కేసుల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అభివృద్ధిలో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపితే.. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story