Ayyanna Patrudu : జైల్లో ఉండే వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది : అయ్యన్న పాత్రుడు

X
By - TV5 Digital Team |19 May 2022 6:00 PM IST
Ayyanna Patrudu : జైలులో ఉండే వ్యక్తికి అధికారం ఇస్తే.. రాష్ట్రం ఎలా బాగుపడుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు.
Ayyanna Patrudu : జైలులో ఉండే వ్యక్తికి అధికారం ఇస్తే.. రాష్ట్రం ఎలా బాగుపడుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై అనకాపల్లి జిల్లా యలమంచలిలో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నేతలు మూడు సంవత్సరాలు ఇంట్లో పడుకుని.. ఇప్పుడు గడపగడపకూ వైసీపీ అంటూ రోడ్లపై తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక సీఎం జగన్‌కి జనంలోకి రావాలంటే భయమని విమర్శించారు. ఒకవేళ జనంలోకి వస్తే 3వేల మంది పోలీసులతో బందోబస్తు కావాలని, షాపులు బంద్ చేయాలని ఆయన విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com