దళితుల పట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానం : వర్ల రామయ్య

దళితుల పట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానం : వర్ల రామయ్య
30 ఏళ్లుగా దళితులకు చెందిన 690 ఎకరాలు అనుభవించింది జగన్‌రెడ్డి కాదా? అంటు వర్ల రామయ్య ప్రశ్నించారు.

దళితుల పట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానమన్నారు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు-వర్ల రామయ్య. ఏపీ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

30 ఏళ్లుగా దళితులకు చెందిన 690 ఎకరాలు అనుభవించింది జగన్‌రెడ్డి కాదా? అంటు ప్రశ్నించారాయన. ఎవరు అన్యాయం చేస్తున్నారో దళితులు ఆలోచించాలన్నారు.

దళితుల భూములను తెలియక తీసుకున్నామని నాడు అసెంబ్లీలో వైఎస్‌ చెప్పారని, 690 ఎకరాలు తెలియకుండానే ఎలా తీసుకుంటారన్నారు. తెలియకుండానే 30 ఏళ్లు పాటు ఈ భూమి సాగు చేసుకున్నారా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జగన్‌ కుటుంబం దళితులకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు.


Tags

Next Story