Palnadu: పల్నాడు జిల్లాలో టీడీపీ నేత కంచర్ల జాలయ్య దారుణ హత్య..

Palnadu: పల్నాడు జిల్లాలో టీడీపీ నేత కంచర్ల జాలయ్య దారుణ హత్య..
Palnadu: పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వర పాడులో తెలుగుదేశం నాయకుడు కంచర్ల జాలయ్యను ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు.

Palnadu: పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వర పాడులో తెలుగుదేశం నాయకుడు కంచర్ల జాలయ్యను ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. గురువారం రాత్రి జాలయ్యపై.. ప్రత్యర్థులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన జల్లయ్యను స్థానికులు మొదట మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తర్వత మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాలయ్య చనిపోయారు. జంగమేశ్వరపాడుకు చెందిన జాలయ్య కుటుంబం.. కొన్ని వివాదాల కారణంగా గురజాల మండంల మాడుగులకు వలస వెళ్లింది.

ఐతే బొల్లాపల్లి మండలం రావులాపురంకు చెందిన ఎల్లయ్య కొడుకుకు ఇటీవల వివాహం కుదిరింది. దీంతో పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎల్లయ్య.. జాలయ్య, మరో వ్యక్తి బక్కయ్యతో కలిసి మించాలపాడుకు వచ్చారు. ఐతే వీరు మించలపాడు వస్తున్న విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు మన్నెయ్య, రమేష్‌, చిన భద్రయ్యతో పాటు మరో 15 మంది మించల పాడు బస్‌ స్టాప్‌ దగ్గర కాపు కాసారు. బైక్‌పై వస్తున్న జాలయ్య, ఎల్లయ్య, బక్కయ్యలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స పొందుతు జాలయ్య ప్రాణాలు కోల్పోయాడు.

ఇటీవలే టీడీపీకి చెందిన జాలయ్య.. వైసీపీకి చెందిన మన్నెయ్య వర్గానికి మధ్య రాజీ కుదిరింది. దీంతో జాలయ్య వర్గం కూడా వైసీపీలో చేరింది. అయినప్పటికీ భయం కారణంగా గ్రామానికి తిరిగిరాలేదు జాలయ్య. ఇక దాడులు ఉండవు అన్న క్రమంలో ఒక్కసారిగా ప్రత్యర్థులు జాలయ్యపై దాడి చేశారు. దీంతో జంగమేశ్వర పాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరిన్ని దాడులు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ జంగమేశ్వర పాడు వెళ్లనుంది టీడీపీ నేతల బృందం. టీడీపీ కార్యకర్త జాలయ్య అంత్యక్రియల్లో టీడీపీ బృందం పాల్గొననుంది. ఈ బృందంలో కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మరోవైపు పల్నాడులో హత్యా రాజకీయాలపై డీజీపీకి లేఖ రాశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. జాలయ్య హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల తీరుతోనే పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. వైసీపీ నేతలతో పోలీసులు అంటకాగడం వల్లనే హత్యలు పెరిగిపోయాయన్నారు. పల్నాడును రక్తసిక్తం చేస్తున్న పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని బాకీలు సెటిల్‌మెంట్ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు. జాలయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story