వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది : గోరంట్ల బుచ్చయ్య

వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది : గోరంట్ల బుచ్చయ్య
ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించుకోవాలని అన్నారు గోరంట్ల.

వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించుకోవాలని అన్నారు. ఈనెల 12న అరెస్ట్ చేసిన అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రిమాండ్‌లో భాగంగా కాకినాడ సబ్‌జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు... రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న టీడీపీ నేతలు.. రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపారు. రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story