చంద్రబాబు వెంట్రుక కూడా జగన్ పీకలేడు: MLC అశోక్ బాబు

CM జగన్ పై TDP MLC అశోక్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. CM జగన్ చంద్రబాబు ని చూసి భయపడుతున్నట్లు ఆయన మొహం చూస్తే అర్థం అవుతుందన్నారు. నేడు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లి కూడా CM జగన్ రాజకీయాలు మాట్లాడాడు, 14 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారుటీవీ5 తో పాటు మిగతా ఛానెల్స్ పై పదే పదే సీఎం మాట్లాడటం సిగ్గు చేటని పేర్కొన్నారు. చంద్రబాబు ని అసభ్య పదజాలంతో దూషిస్తే అంతకుమించి మేము మాట్లాడగలమని అన్నారు. బాబాయ్ ని గొడ్డలిపోటు పొడిచి చంద్రబాబు ని వెన్నుపోటు అంటే ఎవరు నమ్మరని తెలిపారు.
జగన్ పిల్లలకు మేనమామ కాదు, దొంగ మామ. జగన్ చరిత్ర రక్త చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు వెంట్రుక కూడా సీఎం జగన్ పికలేరని మండిపడ్డాడు. మీ నాన్న వైఎస్ చంద్రబాబు ని ఏమి చేయలేకపోయారు ఇక నువు ఏమి చేస్తావని పేర్‌కొన్నాడు.నాలుగేళ్లుగా చంద్రబాబు వెంట్రుక కూడా తాకలేదు ఇక ఈ ఏడాదిలో ఏమి చేయగలరనన్నారు. సీఎం జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com