TDP: వైసీపీపై చర్యలు తీసుకోవాలి: గవర్నర్‌కు టీడీపీ నేతల విన్నపం..
TDP leaders (tv5news.in)
TDP: వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం గవర్నర్‌ను కోరింది. రాజ్‌భవన్లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, నేతలపై దాడులకు సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు.
వైసీపీపై చర్యలు తీసుకోవాలని కోరామని, గవర్నర్ ముందు రెండు డిమాండ్లు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించడంతో పాటు గత మూడ్రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశామన్నారు.
తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అసమర్థ డీజీపీ ఉన్నారని, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com