TDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ..

X
TDP: ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీలు రాంమోహన్‌నాయుడు, కనకమేడల లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీలపైనా, ముఖ్యంగా తెలుగుదేశం నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని లేఖలో ఆరోపించారు.
టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ఒప్పుకున్నట్లు గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చర్యలకు పాల్పడుతోందని, ఫోన్ల ట్యాపింగ్‌పై వెంటనే విచారణ జరిపించాలని అమిత్ షాకు రాసిన లేఖలో టీడీపీ ఎంపీలు కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
