AP : ఏపీలో మూడురోజులు మందు బంద్

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముడ్రోజులపాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 3 నుంచి జూన్ 5 వరకు అంటే.. మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని హోటల్స్, లాడ్జీల్లో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయా జిల్లాల సిబ్బందికి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com