AP : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. అధికారులపై వేటు

AP : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. అధికారులపై వేటు
X

విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి 2 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. మరో 24 మంది ఆస్పత్రిపాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు VMC ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులు పైప్‌లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని ప్రజలకు సూచించారు.

వారం రోజుల్లో 26 మంది కలుషితనీటి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పైపులైన్ లో వస్తున్న తాగునీటిని పరీక్షిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాస్పత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు..

Tags

Next Story