AP: వైసీపీకి దిమ్మతిరిగే షాక్

AP: వైసీపీకి దిమ్మతిరిగే షాక్
X
వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్‌ బై... మరికొందరు అదే బాటలో...

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పారు. ఏకకాలంలో పదవికి, పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా పత్రాలను అందజేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. మరో ఎంపీ బీద మస్తాన్‌రావుతో కలిసి ఆయన రాజీనామా చేశారు. త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. ‘అధికారం తనకు కొత్తేమీ కాదని.. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశానని మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఏడాదికాలంగా తన నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేశానని,,. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతిఘోరమైన తీర్పు ఇచ్చారని తెలిపారు.

ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని గుర్తు చేసిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ... మరికొంత మంది రాజీనామా చేశారన్నారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై వైసీపీ అధిష్ఠానం విశ్లేషించుకోవాలని... అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు అని.. ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నానని... త్వరలో టీడీపీలో చేరుతానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నా’’అని మోపిదేవి అన్నారు.

వైసీపీ మునిగిపోయే నావ

వైపీసీ మునిగిపోయే నావ అని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో గంటా మీడియాతో మాట్లాడారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో జగన్‌ తప్ప ఎవరూ మిగిలేట్లు లేరని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఈ పరిస్థితికి జగనే కారణమన్నారు. వైకాపా నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామని గంటా చెప్పారు.

Tags

Next Story