Pinnelli Case : నేడు పిన్నెల్లి కేసులపై తీర్పు

Pinnelli Case : నేడు పిన్నెల్లి కేసులపై తీర్పు
X

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే పిన్నెల్లిపై హత్యాయత్నం లాంటి తీవ్ర కేసులు ఉన్నాయని, వాటిలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఫిర్యాదుదారుల తరఫు లాయర్ వాదించారు. పోలింగ్ రోజున అరాచకానికి పాల్పడ్డ ఆయనను కౌంటింగ్ కేంద్రానికి అనుమతించవద్దని కోరారు.

పిన్నెల్లి దాడి బాధితుడు సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాంటి వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు.

Tags

Next Story