AP : విజయవాడ కిడ్నీ రాకెట్ : హోంమంత్రి అనిత సీరియస్

విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anitha ) ఆగ్రహం వ్యక్తం చేశారు . గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీ, జిల్లా కలెక్టర్ తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలన్నారు. బాధితుడి ఫిర్యాదుతో పాటుగా, హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిదంటే ?
గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన మధుబాబు అర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో తన కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. బాషా అనే వ్యక్తి ద్వారా వెంకట్ తో మధుబాబుకు పరిచయం ఏర్పడింది. కిడ్నీ అమ్మితే రూ. 30లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడు వెంకట్. 2024 జూన్ 15న విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మధుబాబుకి కిడ్నీ ఆపరేషన్ చేశారు. అతని నుంచి ఒక కిడ్నీ తీసుకున్నారు. మరో వ్యక్తికి దాన్ని సెట్ చేశారు.
ఆపరేషన్ వరకూ మధుబాబుకి వెంకట్ ఇచ్చింది రూ.1,10,000 మాత్రమే. మిగితా డబ్బుల కోసం అడిగితే వెంకట్ రివర్స్ అయ్యాడు. దీంతో తాను అడ్డంగా మోసపోయానని గ్రహించిన మధుబాబు గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని, తనలా మరెవ్వరూ మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com