వైసీపీ హయాంలో విశాఖ ధ్వంసం.. కూటమి పాలనలో పెట్టుబడుల వరద..

వైసీపీ హయాంలో విశాఖ ధ్వంసం.. కూటమి పాలనలో పెట్టుబడుల వరద..
X

వైసీపీ పాలనలో అభివృద్ధి అనే మాటే మరిచిపోయిన విశాఖపట్నం ఇప్పుడు మళ్లీ బిజినెస్ మ్యాప్‌లోకి వచ్చేస్తోంది. ఐటీ నుంచి ఇండస్ట్రీస్ వరకూ అన్ని రంగాల దృష్టి ఇప్పుడు విశాఖపై పడుతోంది. జగన్ హయాంలో ఒక్క పెద్ద పెట్టుబడీ రాకుండా, నగర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. కొండలు తవ్వడం, ప్రాజెక్టులు నిలిపివేయడం లాంటి నిర్ణయాలతో విశాఖ బ్రాండ్ ను దారుణంగా దెబ్బతీశాడు. కానీ, చంద్రబాబు నాయకత్వం తిరిగి రావడంతో ఆ దిశ మారింది. ఆయన మళ్లీ ఆర్థిక చైతన్యాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులు విశాఖకు వచ్చేశాయి. టీసీఎస్, క్వాంటమ్ లాంటివి పెట్టుబడులు పెట్టాయి.

ఇక నేటి నుంచి సీఐఐ సదస్సు విశాఖ ప్రతిష్ఠను కొత్త స్థాయికి తీసుకువెళ్లబోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొననున్న ఈ సదస్సులో సుమారు 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపు 400కు పైగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చర్చలు జరగనున్నాయి. 48 కీలక సెషన్లు, వివిధ రంగాల పెట్టుబడి అవకాశాలపై చర్చలు, బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) మీటింగ్స్ జరగబోతున్నాయి. ఏపీ పెవిలియన్, రాష్ట్రంలోని ప్రత్యేక అవకాశాలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

హ్యాక్‌థాన్ సమావేశాలు, యూత్ ఎంపవర్ మెంట్ లాంటివి ఉంటాయి. అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేలా ఈ సదస్సును వినియోగించుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. చంద్రబాబు ఇటీవల దుబాయ్ పర్యటనలో ప్రముఖ ఇండస్ట్రియలిస్టులను ఏపీకి ఆహ్వానించగా, లోకేష్ ఆస్ట్రేలియాలో కంపెనీలను ఈ సదస్సులో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పుడు వారంతా విశాఖలో అడుగుపెడుతున్నారు. విశాఖ మళ్లీ పరిశ్రమల కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా అవతరించడానికి ఈ సదస్సు కీలకంగా మారబోతోంది.

Tags

Next Story