Crime News: మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్ఏ హత్య

కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది.. మంచం కింద డిటోనేటర్లు పేల్చి హత్య చేయడం సంచలనంగా మారింది. వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలు ఏమైందంటే...?
వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. అయితే ఆయన మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చడంతో ఆయన అక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో వీఆర్‌ఏ నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.. బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు ధ్వంసమైంది.. మృతి చెందిన వీఆర్ఏ నరసింహ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వివాహాతర సంబంధమే కారణమా..
బాబు అనే వ్యక్తిపై మృతుడి కూతురు పుష్పావతి అనుమానం వ్యక్తం చేస్తోంది . మా అమ్మ.. బాబుతో మాట్లాడలేదన్న కోపంతోనే మా నాన్నను చంపాడు.. గతంలో కూడా మా నాన్నను చంపేందుకు బాబు ప్రయత్నం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. బాబు అనే వ్యక్తి కుటుంబానికి.. తమ కుటుంబానికి మధ్య గతంలో గొడవలు జరిగాయని.. రాత్రి తన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి.. డిటోనేటర్లు పెట్టి.. తన తల్లిదండ్రుల్ని బాబు చంపాడని ఆరోపించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లా పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో వరుసగా భారీగా చోరీలు జరిగాయి. దీంతో పోలీసులు ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసి ఓ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్ణాటకకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర బంగారు ఉండటంతో ఆరా తీయగా.. నిందితుడు తాము చేసిన చోరీలను ఒప్పుకున్నారు. వీరిలో నాగరాజు అనే నిందితుడి దగ్గర నుంచి రూ.28 లక్షల విలువైన 400 గ్రాముల బంగారు, రూ.12వేలు విలువ జేసే వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలో గతంలోనే కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతంలో పీలేరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయగా తప్పించుకున్నాడు. అతడితో పాటూ మరో బాలుడు పోలీసులకు దొరికాడు.. అతడ్ని తిరుపతిలోని బాలనేరస్థుల కారాగారానికి తరలించారు పోలీసులు. నిందితుడు నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అంతేకాదు అతడిపై కర్ణాటకలో ఓ హత్య కేసు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com