YS Jagan Letter : మోడీకి రాసిన లేఖలో జగన్ ఏమన్నారంటే..?

టీటీడీ లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
"శ్రీవేంకటేశ్వరస్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని
రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు. టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి.. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి.. వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
"చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజల దృష్టిని మరల్చడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. దీంట్లో భాగంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారు. రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీలో ధృఢమైన విధానాలు, పద్ధతులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ పద్ధతులు టీటీడీలో అమలులో ఉన్నాయి. టీటీడీ గొప్పతనాన్ని చెప్పాల్సింది. పోయి చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధ అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయి. భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఒక సమావేఏర్పాటు చేసుకుంది."
"కాని కొత్త ప్రభుత్వం పట్ల ప్రజానీకం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టలేకపోయారు. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. దీంట్లో భాగంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు చేరిందని ఆరోపణలు చేశారు. నిజానికి టీటీడీలో ప్రసాదాల నాణ్యతను,అందులో వాడే పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. నాణ్యత లేకపోతే ఆయా పదార్థాలను తిరస్కరిస్తారు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com