AP : వైసీపీ కౌన్సిలర్లు జంప్‌కు సిద్ధం!

X
By - Manikanta |8 Jun 2024 2:18 PM IST
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయింది. పార్టీ కూడా అధికారం పరంగా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. దీంతో కిందిస్థాయి లీడర్లు ఆలోచనలో పడ్డారు. కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో కౌన్సిలర్లు, సర్పంచులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు.
వైసిపి లో ఉంటే మనుగడ ఉండదనీ.. అధికార పార్టీ లో చేరడానికి కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. పలు చోట్ల అవిశ్వాసాలకు సిద్ధమవుతున్నారు లీడర్లు.
ప్రతి మున్సిపాలిటీనీ అధికార పక్షం చేసి నిధుల సమీకరించి ప్రగతి బాటపట్టించాలన్న ఆలోచనలో వైసీపీ కౌన్సిలర్లు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలిచాక అదే పరిస్థితి ఎదురైంది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ కౌన్సిలర్లు అధికారపార్టీవైపు షిఫ్ట్ అయ్యారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com