వైసిపికి కల్తీ మద్యం మరకలు.. ఫేక్ నిరసనలు

గుమ్మడికాయల దొంగ ఎవడ్రా అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది వైసిపి నేతల పరిస్థితి. ఏపీలో కల్తీ మద్యం వైసీపీని ఇరకాటంలో పడేసింది. ఆధారాలతో సహా కల్తీ మద్యం మహమ్మారి బయటపడటంతో.. వైసీపీ మీద ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే అవన్నీ తమకు పట్టనట్టు వైసిపి నేతల వ్యవహారం షరా మామూలుగానే ఉంది. జగన్ తన పార్టీలో ఎంతమంది తప్పులు చేసిన ఎన్ని తప్పులు చేసినా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకం ఏపీ ప్రజలకు అసలే లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో చూసాం కదా.. ఎన్ని తప్పులు చేస్తే అంత పెద్ద పదవి అన్నట్టు జగన్ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కల్తీ మద్యం మరకలు వైసిపికి తుడుచుకోలేని విధంగా తయారయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక.. చివరకు కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోంది అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. దొంగను పోలీసులు పట్టుకుంటే.. చివరకు పోలీసులే దొంగతనం చేశారని దొంగలు చెబితే ఎలా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ చేస్తున్న నిరసనలు కూడా అలాగే ఉన్నాయి.
కల్తీ మద్యం తయారీ కేసులో ఓవైపు జనార్దన్ రావు అరెస్టు అయ్యారు. ఆయన కీలక విషయాలను చెబుతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకోపక్క ఇప్పటికే 15 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏకంగా టిడిపి నేత జయచంద్రా రెడ్డి ఇందులో ఉన్నారని తెలియడంతో వెంటనే చంద్రబాబు నాయుడు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం దందా నిజం కాకపోతే వైసిపి కోసం సొంత పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు దూరం చేసుకోరు కదా. టిడిపి నేతలపై కూడా యాక్షన్ తీసుకుంటున్నారంటేనే ఇక్కడ అర్థం కావట్లేదా ఇది నిజమే అని. ఇంత పక్కా ఆధారాలతో వైసిపి నేతల బాగోతం బయటపడితే.. జగన్ ఒక్క మాట కూడా దీనిపై స్పందించలేదు. పైగా లండన్ కు వెళ్ళిపోయి ఇక్కడున్న వైసీపీ నేతలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయించడం చూస్తుంటే.. వాళ్ల తప్పులను ప్రశ్నిస్తే ఎవరిపై అయినా బురదజల్లేందుకు సిద్ధపడతారని దీని ద్వారా మరోసారి తెలిసింది. వైసిపి చేస్తున్న ఆరోపణలు ఏంటంటే కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని.. మరి దానికి సంబంధించిన ఒక్క ఆధారమైనా చూపించాలి కదా. ఎక్కడ తయారు చేస్తున్నారో బయట పెట్టాలి కదా. వైసీపీ ప్రభుత్వంలో చేసిన కల్తీ మద్యం దందా ములకలచెరువులో సాక్ష్యాలతో సహా బయటపడింది.
మరి ప్రభుత్వం అలాంటి కల్తీ మద్యం కేంద్రం ఎక్కడ పెట్టిందో ఒక్కరైనా చెప్పట్లేదు ఎందుకు. అందులో ఎవరు ఉన్నారనేది ఎందుకు బయట పెట్టట్లేదు. ఒక్క సాక్ష్యమైనా ఎందుకు చూపించట్లేదు. ఎందుకంటే అవన్నీ ఫేక్ ఆరోపణలు కాబట్టి. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం, నిజమైన మద్యానికి మధ్య తేడాను గమనించడం కోసం సురక్ష యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మద్యం సీసాపై ఉన్న కోడ్ ను స్కాన్ చేస్తే అది నిజమైందా కాదా అనేది ఇట్టే తెలిసిపోతుంది. కల్తీ మద్యం వల్ల ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎవరూ అడగకముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వం కల్పిమధ్యం తయారు చేస్తుంది అంటే ఏపీ ప్రజలు ఎలా నమ్మాలి. వైసిపి నేతలు ఆమాత్రం ఆలోచించకుండానే ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారా.. అయినా వాళ్లకు ప్రశ్నించే వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకే ఇలాంటి ఫేక్ నిరసనలతో కల్తీ మద్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా మొదలుపెట్టారన్నమాట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com